Political : త్వరలోనే మునుగోడు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రతి ఒక్క పార్టీ సన్నాహాలు చేస్తుంది ఈ సందర్భంగా భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.. దమ్ముంటే కేసీఆర్ మీరు మునుగోడు నుంచి పోటీ చేసి గెలవండి అంటూ సవాలు విసిరారు..
మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరిన రాజగోపాల్‌రెడ్డి.. నల్గొండ జిల్లా అంటే విప్లవాల ఖిల్లా అన్నారు.. తమని దొంగదెబ్బ తీసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ వేసేందుకు పెద్ద ఎత్తున భాజపా కార్యకర్తలు, నేతలతో వెళ్లిన రాజగోపాల్‌రెడ్డి.. ఈ సందర్భంగా కెసిఆర్ ను విమర్శించారు.. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌ఛుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. నామినేషన్ వేసిన అనంతరం చండూరులో మీడియాతో మాట్లాడుతూ “మునుగోడులో పోటీకి కేసీఆర్ వస్తారా? కేటీఆర్ వస్తారా? సిద్దిపేట రోడ్లు.. మునుగోడు రోడ్లకు తేడా చూడండి. కేసీఆర్.. మీరు రాష్ట్ర ప్రజల సొత్తు రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. ప్రజలు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. వచ్చే బతుకమ్మ నాటికి కవిత తీహార్ జైలుకు వెళ్తారు. ప్రజలందరికి దృష్టి మునుగోడు ఉప ఎన్నికపైనే ఉంది. దేశం మొత్తం దీనిపై చర్చించుకుంటోంది” అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.