ఆకలి వేస్తున్నప్పుడు వెంటనే తినకపోతే కోపం.. చిరాకు వచ్చేస్తోంది. దీనివల్ల ఎవరిమీద పడితే వారి మీద అరిచేస్తాం. ఇక ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే టైమ్‌కి రాకుంటే ఆ డెలివరీ బాయ్ పని అయినట్లే. పైగా రేటింగ్ తక్కువ ఇచ్చి, కంప్లైంట్స్ ఇవ్వడం ఇలా చాలానే చేస్తాం. కానీ దీనికి విరుద్ధంగా ఓ వ్యక్తి బిహేవ్ చేశారు. ఆయన చేసిన పనికి డెలివరీ బాయ్ షాకయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే..
ఇటీవల దిల్లోలోని సంజీవ్ త్యాగి అనే ఓ వ్యక్తి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశారు. అయితే డెలివరీ బాయ్ గంట లేటుగా ఫుడ్ తీసుకొచ్చాడు. ఆ కస్టమర్ డెలివరీ బాయ్ మీద ఓ రేంజ్లో ఫైర్ అవుతాడని ముందే అనుకొని అందుకు తగ్గట్లు ప్రిపేర్ అయిపోయి ఫుడ్ తీసుకెళ్లి ఆ వ్యక్తికి ఇచ్చాడు డెలివరీ బాయ్. అంతే ఒక్కసారిగా అక్కడి పరిస్థితికి షాక్ అయ్యాడు డెలీవరీ బాయ్. తాను అనుకున్నట్లు అక్కడ ఏం జరగలేదు.
సంజీవ్ త్యాగి కాస్తయినా కోపం చూపించలేదు. పైగా ఎదురుగా ఓ పల్లెంలో బొట్టు, అక్షింతలు తీసుకొచ్చి.. డెలివరీ బాయ్ నుదిటిపై బొట్టు పెట్టి.. అక్షింతలు వేశాడు. దీనికి బ్యాక్‌గ్రౌండ్‌లో 90ల్లో వచ్చిన బాలీవుడ్ మూవీ విజయపథ్లోని ఆయియే ఆప్కా ఇంతిజార్.. అనే పాట ప్లే చేశాడు. డెలివరీ బాయ్ కూడా నవ్వుతూ తన హెల్మెట్ తీసి బొట్టు పెట్టించుకున్నాడు. ఈ వీడియోను త్యాగి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. దసరా సంబర్భంగా దిల్లో ట్రాఫిక్ విపరీతంగా ఉన్నా ఆర్డర్ అందుకున్నా..థాంక్యూ జొమాటో అని రాసుకొచ్చారు. ఈ వీడియోను లక్షల మంది చూశారు. పెద్దాయన చేసిన పనికి నెటిజన్లు తిట్టకుండా ఇలా చేయడం చాలా బాగుంది అని అంటున్నారు.