Political మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నిక ఫలితాలు భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని భావిస్తున్న నేపథ్యంలో, మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అఖండ విజయం సాధించేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది.. ఈ నేపథ్యంలో ఉపఎన్నికపై భాజపా ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ నేతలను ప్రకటించగా.. తాజాగా అధికార భాజపా తన అభ్యర్థిని ప్రకటించింది..
అధికార పార్టీ భాజపా మునుగోడు ఉపఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది.. గెలుపే తమ లక్ష్యంగా ముందుకు వెళుతున్న భాజపా రాజగోపాల్ రెడ్డిని తమ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. అలాగే బహుజన్ సమాజ్ వాద్ పార్టీ కూడా తమ అభ్యర్థిని అనౌన్స్ చేసింది. ఆందోజు శంకరా చారిని తమ పార్టీ తరఫున బరిలోకి దింపనున్నట్లు తెలిపింది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి అధికారపార్టీ టీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ చేయగా.. ఇక కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి ఇప్పటికే ప్రచారం చేస్తుంది..
తాజాగా అధికార బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉపఎన్నిక సన్నాహాక సమావేశం జరిగింది. మునుగోడు ఉపఎన్నిక స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ పరిస్థితి, ప్రచార వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల ప్రచారాల్లో కూడా ఎవరు తగ్గకుండా ముందుకు దూసుకుపోతున్నారు.. అయితే మునుగోడులో బీసీలు ఎక్కువగా ఉండటంతో అందరూ ఫోకస్ వీరి పైనే ఉంది..