Bhakthi విజయదశమి.. చెడు పై మంచి గెలిచిన ఈ రోజును దేశమంతా ఘనంగా దసరా పండుగ జరుపుకుంటుంది.. అయితే ఈ రోజును కచ్చితంగా కొన్ని నియమాలు పాటించడం ద్వారా మంచి జరుగుతుందని నమ్మకం అవేంటో చూద్దాం..
ప్రతి సంవత్సరం ఆశ్వియుజ మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున విజయదశమి లేదా దసరా పండుగను జరుపుకుంటారు… ఇదే రోజున శ్రీరాముడు రావణాసురుని వధించాడనే పురాణాలు చెబుతున్నాయి.. ఇదే రోజున దుర్గ అమ్మవారు మహిషాసురుని వధించారని చెప్తారు.. అందుకే ఈరోజును ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామ చరిత్రను చదవటం ద్వారా పుణ్యం కలుగుతుందని నమ్మకం..
అలాగే శివుణ్ణి దర్శించుకోవడం ద్వారా కూడా శుభాలు కలుగుతాయని నమ్మకం.. దసరా పండగ రోజు వీలైతే అవసరంలో ఉన్నవారికి దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే దేవాలయానికి సంబంధించి ఏవైనా వస్తువులను దసరా రోజు దానం చేసిన మంచి జరుగుతుంది.. జమ్మి చెట్టును పూజించడం ద్వారా జాతక నక్షత్రంలో ఉండే శని దోషాలు పోతాయి అలాగే పూజ చేసిన వెంటనే ఇంటిలో ఉన్న పెద్ద వారికి నమస్కరించడం ద్వారా విశేష ఫలితాలు కలుగుతాయి అని నమ్మకం.. అలాగే వీలైనంతవరకు మద్యం, మాంసం ముట్టకుండా దేవుడిని పూజించడం వల్ల దుర్గాదేవి అనుగ్రహం కలుగుతుందని తెలుస్తుంది. అలాగే ఈ రోజున చెట్లును నరకటం.. జంతువులని చంపటం చేయరాదు..