రిలయన్స్ జియో మరో సంచలనం సృష్టించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జియో ఫోన్‌లతో మంచి సక్సెస్ అందుకొన్న ఈ దిగ్గజ సంస్థ మరో కొత్త ప్రొడక్ట్‌ను లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. జియోబుక్ పేరుతో ల్యాప్‌టాప్‌ను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానుంది. అది కూడా కేవలం రూ.15 వేలకే అందించనుంది.
ఈ ల్యాప్‌టాప్ 4జీ నెట్‌వర్క్‌తో పనిచేయనుంది. ఇందుకు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలైన క్వాల్‌కామ్ ఎలక్ట్రానిక్స్ చిప్స్‌ను అందించనున్నాయి. ఇక మైక్రోసాఫ్ట్ కంపెనీ కొన్ని యాప్‌లకు విండోస్ ఓఎస్‌ను అందించనున్నాయి. అయితే ఇప్పటివరకు దీనిపై రిలయన్స్ కంపెనీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.