Political రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారని చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై తెరాస పార్టీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా సీఎం కేసీఆర్ తమ జాతీయ పార్టీ పేరును దసరా రోజు వెల్లడిస్తున్నట్టు ప్రకటించారు..
రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేయటానికి సిద్ధమవుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇందుకు తగినట్టు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్న కెసిఆర్.. తాజాగా తమ జాతీయ పార్టీ పేరును వెల్లడిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 5వ తేదీన విజయదశమి సందర్భంగా మధ్యాహ్నం 1:19 నిమిషాలకు తమ జాతీయ పార్టీ పేరును తెలియజేయనున్నారు.. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎన్నో చర్చలు జరిపిన తెరాస పార్టీ తాజాగా తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.. పార్టీ పేరు ఖరారుతోపాటు దీనికి సంబంధించిన ఎన్నో కీలక నిర్ణయాలు ఈరోజు ప్రగతిభవన్లో చర్చించినట్టు సమాచారం.. దసరా రోజు ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో దీనికి సంబంధించిన చర్చ జరగనున్నట్టు తెలుస్తుంది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నా తెరాస నాయకులు, కార్యదర్శులు, మంత్రులు హాజరవ్వనున్నట్టు సమాచారం. అయితే తెరాస పార్టీ పేరును మార్చనున్నట్టు కూడా తెలుస్తుంది. తెరాస పార్టీ రాజకీయ పార్టీగా మార్చటం ద్వారా ఎలాంటి సమస్యలు రాకూడదని పార్టీ పేరు మారుస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా పార్టీ గుర్తుకు ఎలాంటి మార్పు ఉండదని తెరాస నాయకులు అంటున్నారు.. అయితే ఇందుకు సంబంధించి ఇంకా పలు కీలక నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని తెరాస మంత్రివర్గం అంటుంది..