Bonda Uma : రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రజాధనాన్ని అనవసర కేసులకు వృధా చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలోని ఏ రాష్ట్రమైన న్యాయపరమైన హక్కుల కోసం, ఇతర రాష్ట్రాలతో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ ల సాధనకు, రాష్ట్ర ప్రయోజనాల కోసం హైకోర్టు, సుప్రీం కోర్టు ప్రభుత్వ, ప్రైవేటు లాయర్లని నియమించుకుంటారు. ఏపీలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అతని మీద, అతని కుటుంబం మీద ఉన్న సిబిఐ, ఈడి కేసులు వాదిస్తున్న లాయర్లను వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం తరపున కోట్ల రూపాయలు లాయర్లకు ముట్టజెబుతున్నారు.
అవసం లేని కేసులలో కూడా వాళ్లని లాయర్లగా ఏపీ ప్రభుత్వం తరపున నియమిస్తున్నారు. వారికి కోట్ల రూపాయల ప్రజాధనం ఫీజులు రూపాన చెల్లిస్తున్నారు. గతంలో అనేకసార్లు ఇది రుజవైంది. పోలవరం పై గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన జడ్జిమెంట్ మీద ఓ ఎన్జీవో ఆర్గనైజేషన్ సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ కేసును వాదించడానికి అమిత్ షేక్ షింగ్రి అనే ప్రైవేటు లాయర్ ని నియమించారు. అతను ఆ కేసుకు హాజరుకాకపోవడంతో అప్పటికప్పుడు వెంకట్రామయ్యను తీసుకొచ్చారు.
ఇలా ఎంతో మందిని లాయర్లుగా నియమించి రాష్ట్ర ప్రజల ధనాన్ని నీళ్ళ లాగా ఖర్చు పెడుతున్నారు. జగన్ రెడ్డి తీరును చూసి సుప్రీం కోర్టే నివ్వెరపోయింది. దేశంలోని 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడ ప్రైవేటు లాయర్లని నియమించుకోవడం లేదు. గంటకు లక్షల రూపాయలు ఫీజులు తీసుకొనే లాయర్లని ప్రభుత్వం నియమించింది. ఈ వైఖరికి సుప్రీం కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లాయరు ఎవరు? ఎందుకు ఇంత మందిని నియమిస్తున్నారు? ప్రభుత్వం ఖర్చు చేసే లెక్కలపై నోటిసు ఇవ్వాల్సివస్తుందని సుప్రీం కోర్టు బెంచి సీరియస్ కామెంట్స్ చేసింది.’’ అని వ్యాఖ్యానించారు.