Bhakthi : హైదారాబాద్ లో హైటెక్ సిటీలోని మైదాన్ ఎక్స్ పో సెంటర్ లో మామిడి దీప్తి గారి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. తెలంగాణ అడబిడ్డలు ఎంతో ఇష్టంగా.. అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ బతుకమ్మను తొమ్మిది రోజులు పాటు సాగుతాయి. ఈ నేపథ్యంలో నగరంలోని మెటల్ చార్మీనార్ దగ్గర హైటెక్ సిటీ లో “మన బతుకమ్మ సంబరాలు” పేరుతో దీప్తి మామిడి గారు ఘన నిర్వహించారు.
ఈ వేడుకల్లో సినీ రంగం మరియు వ్యాపార రంగం లోని వందల మంది మహిళలు పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. మొన్న ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన ఈ పండగను పురస్కరించుకుని తంగేడు, గునుగు, గులాబీ తదితర పూలతో తయారు చేసిన బతుకమ్మ వేడుకల్లో పెద్దఎత్తున మహిళలు పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.