Political మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నిక ఫలితాలు భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని భావిస్తున్న నేపథ్యంలో, మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అఖండ విజయం సాధించేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ ఉపఎన్నికపై భాజపా నాయకత్వం దృష్టి సారించింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉపఎన్నిక సన్నాహాక సమావేశం జరిగింది. మునుగోడు ఉపఎన్నిక స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ పరిస్థితి, ప్రచార వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ ఉపఎన్నిక స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి పలువురు నేతలు హాజరయ్యారు.. ఈటల రాజేందర్, జితేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గంగిడి మనోహర్ రెడ్డి, దాసోజు శ్రావణ్, రవీంద్ర నాయక్, గరికపాటి మోహన్ రావు, యేన్నం శ్రీనివాస్ రెడ్డితో పాటు పార్టీ ఇతర నేతలు హాజరయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం ఈ స్టీరింగ్ కమిటీని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియమించారు. ఈ స్టీరింగ్ కమిటీ… తొలిసారిగా సమావేశమైంది. ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ పరిస్థితి, ప్రచార వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.
అయితే మునుగోడు ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా అన్నీ ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ… అధికార తెరాస అభ్యర్థిత్వతంపై స్పష్టత ఇవ్వకున్నా…. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలంతా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ను వీడి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమ