Political 2014 రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన గిరిజన విశ్వవిద్యాలయం పరిస్థితి దారుణంగా ఉందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఈ మేరకు రాజ్భవన్లో గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ని కలిసిన సీతక్క.. కేంద్రం చొరవతో విశ్వవిద్యాలయాన్ని వేగంగా నిర్మించాలని కోరారు. ఈ గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అస్సలు పట్టించుకోపోవడంతో పరిస్థితి దారుణంగా మారిందని అన్నారు. ములుగులో భూమి కేటాయించినప్పటికీ విశ్వవిద్యాలయం ఇంకా నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హమీ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు గిరిజన విశ్వవిద్యాలయల ఏర్పాటుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం.. ఏపీలో ఇప్పటికే ప్రారంభం కాగా తెలంగాణలో దాని ప్రసక్తే లేవనేత్తలేదని అన్నారు.
“2014 రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన గిరిజన విశ్వవిద్యాలయం.. ఇంతవరకు నాయకులు దానిని పట్టించుకోలేదు. ములుగులో భూమి కేటాయించినప్పటికీ విశ్వవిద్యాలయం ఇంకా నోచుకోలేదు. ఏపీలో ఇప్పటికే ప్రారంభం కూడా అయిపోయింది. గవర్నర్ని కలిసి ఇదే విషయం ఈరోజు వివరించా.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను వేగంగా పరిష్కరించమని కోరా.. ఇప్పటికే ములుగు పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందింది. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటైతే ఎడ్యుకేషన్ హబ్గా మారుతుంది.” అని సీతక్క అన్నారు. అకడామిక్ సంవత్సరం అయినా క్లాసులను ప్రారంభించాలని గవర్నర్‌ను కోరామని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. దాదాపు 8 ఏళ్ల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాప్యం వల్ల ఇదంతా జరుగుతోందని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ట్రైబల్ యూనివర్శిటీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు.