Political ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ ను ఉంచారు.. “ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టడం ఏ విధంగాను వైఎస్‌ఆర్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి ఆయన పేరు తీసేయటం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తి, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయి, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను ఎవ్వరూ చెరిపివేయలేరు” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
విజయవాడలోని డా.ఎన్టీఆర్ హెల్త్ వైద్య విశ్వవిద్యాలయం పేరును డా.వైఎస్‌ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లును బుధవారం ఏపీ శాసనసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ‘తెదేపా హయాంలో ప్రభుత్వ రంగంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క వైద్య కళాశాలా నిర్మించలేదు. అయినా సరే అధికారం ఉందంటూ వైద్య విశ్వవిద్యాలయానికి బలవంతంగా వారికి కావాల్సిన పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు దానినే కొనసాగించాలని అడగటం ఎంతవరకు ధర్మం’ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించిన సంగతి తెలిసిందే.. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి వైద్య విశ్వవిద్యాలయం కొత్తగా నిర్మించకపోవడం.. ఇప్పుడు ఈ యూనివర్సిటీ పేరు మార్చుకోవడం పై తెదేపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.. ఈ విషయంను తెదేపా సీనియర్ నేతలతో పాటు వైయస్ షర్మిల కూడా తప్పు పట్టటం గమన్హరం.
— Jr NTR (@tarak9999) September 22, 2022