Viral Video ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతూ ఉంటాయి…. వాటిలో కొన్ని మాత్రమే అందరినీ విశేషంగా ఆకట్టుకుంటాయి. అలాంటి వాటిలో గిన్నిస్ రికార్డుల కోసం చేసే కార్యక్రమాల వీడియోలు ఎంతో ఆదరణ పొందుతుంటాయి. వాటిలో ఒకటే… ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తెగ వైరస్‌గా మారింది. అది ఏంటో తెలుసా…? ఒక సాధారణ మిస్ కారులో ఆరుగురు, ఏడుగురు కాదు… ఏకంగా 27 మంది యువతులు ఎక్కారు. దాంతో… అంతర్జాతీయంగా ఇలాంటి క్రేజీ పనులకు అవార్డ్‌ను అందించే… గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ ఓ రికార్డ్‌ను వాళ్ల చేతిలో పెట్టేసింది.
వాస్తవానికి ఈ రికార్డ్ 2014లో సాధించారు. కాగా… ఇప్పుడు ఆ వీడియోను గిన్నిస్ రికార్డ్స్ సంస్థ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో… ఓ మినీ కూపర్ కారులో ఒకరిపై ఒకరుగా 27మంది వాలంటీర్లు ఎక్కడం కనిపిస్తుంది. దాంతో.. ఇప్పుడు వైరస్‌గా మారింది. ఎక్కువ మంది పట్టేలా కారు సీట్లను సర్దుబాటు చేశారు…పోటీదారులు. ఒకరిపై ఒకరు ఎక్కుతూ…. స్టీరింగ్, ముందు అద్దానికి మధ్య కూడా ఎక్కేశారు. డిక్కీలో ఐతే నలుగురు ఎక్కడం ఆశ్చర్యపరిచింది. ఇలా… కొంచెం కూడా సందు లేకుండా… మొత్తంగా 27మందిని ఆ కారులో ఎక్కించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా దీనిపై నెటిజన్లు క్రేజీగా కామెంట్లు చేస్తున్నారు. ఒక్కొక్కరూ.. ఒక్కోలా ఆ వీడియో కింద తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ…. నవ్వులు పూయిస్తున్నారు.
How many volunteers can squeeze into this regular-sized Mini Cooper? 😬 pic.twitter.com/wXf4Tihv87
— Guinness World Records (@GWR) September 5, 2022