Political తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే గిరిజనుల కోసం గిరిజనుల బంధు పథకం అమలు చేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు స్వయంగా తన చేతుల మీదగాని ఈ పథకాన్ని ప్రారంభిస్తానని వెల్లడించిన ఆయన భూములు లేని గిరిజనులకు పోడు భూములు పంచుతామన్నారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఆదివాసీ, బంజారా ఆత్మీయ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీ, బంజారా భవన్‌లు వేదికలు కావాలని పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ దృక్పథంతో మేథోమధనం జరగాలని సూచించారు. భారతీయ జాతికి ప్రతినిధులుగా గిరిజన బిడ్డలు ఎదగాలని ఆకాంక్షించిన సీఎం కేసీఆర్ గిరిజనుల సంప్రదాయాలను వారి జీవన శైలిని అందరం కాపాడుదాం అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
గతంలో గిరిజనులకు ఐదు నుంచి పది శాతం రిజర్వేషన్ ఉండేవని అయితే వీటిని ప్రస్తుతం 10 శాతంకి పెంచాలని తన అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు వెల్లడించారు కేసీఆర్ అయితే తాను ప్రతిపాదించిన తీర్మానాన్ని కేంద్రం ఇంకా ఆమోదించాల్సి ఉందని తెలిపారు రాష్ట్రపతి ఆమోదం పొందితే తెలంగాణ రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 10% వస్తాయని స్పష్టం చేశారు. రాబోయే వారం రోజుల్లోనే 10 శాతం రిజర్వేషన్ల జీవో విడుదల చేస్తామన్నారు. అయితే మనకు రావాల్సిన న్యాయపరమైన హక్కులు కూడా కేంద్రం మనకు ఇవ్వట్లేదని కెసిఆర్ ఆరోపించారు ఎన్నో కష్టనష్టాలు కోర్చుకొని సంపాదించుకున్న తెలంగాణ కల్లోలం కావద్దని ఆకాంక్షించారు.. తెలంగాణ సమాజం అంతా ఐక్యతగా ఉండాలని గిరిజనులకు మరిన్ని గురుకులాలను రాష్ట్రానికి తీసుకురానున్నట్టు తెలిపారు..