Bhakthi హిందూ సంప్రదాయం ప్రకారం పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఇంట్లో తాబేలు ఉంచుకోవడం వల్ల చాలా మేలు కలుగుతుందని చెప్తున్నాయి.. తాబేలు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా పూజిస్తారు.. ఆయన శ్రీకూర్మం రూపంలో భూమిపై అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి.. అయితే ఈ తాబేలును ఇంట్లో ఎక్కడ ఉంచుకోవాలి? ఎలా ఉంచుకోవాలి? అనేది తెలుసుకుందాం..
తాబేలును ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆ ఇంట్లో ఉండే ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయని అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ నమ్మకం.. ఇంటికి తీసుకొచ్చే తాబేలు నోరు లోపలికి ఉండేలా మాత్రం కచ్చితంగా చూసుకోవాలి… లేకపోతే ప్రతికూల ప్రభావాలు వస్తాయి. తాబేలును ఇంటికి పౌర్ణమి రోజు తెచ్చుకోవడం చాలా మంచిది. ఆ తీసుకోవాల్సిన తాబేలును కాసేపు పాలలో ఉంచాలి. ఏ వస్తువునైనా ఇంటికి తీసుకొచ్చిన వెంటనే పాలతో కడిగితే వాటి మీద ఏమైనా దోషాలు ఉంటే పోతాయని నమ్మకం. అలాగే తాకట్టు పెట్టిన బంగారం అయినా విడిపించి ఇంటికి తెచ్చాక ఒకసారి పాలల్లో కడిగి తర్వాత నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంకోసారి అవి తాకెట్టుకుపోయే అవకాశం ఉండదని నమ్ముతారు. అలాగే తాబేలును కొని తీసుకొచ్చిన వెంటనే తాబేలు ముందుగా పాలతో కడిగి తర్వాత నీటితో శుభ్రం చేయాలి.. తర్వాత అభిజిత్ ముహూర్తంలో పాల నుంచి తీసి ఒక పాత్రలో నీళ్ళు పోసి అందులో ఈ తాబేలు ఉంచాలి. ఈశాన్య దిశలో తాబేలు నుంచి ఓం శ్రీ ఘోరమైన మహా అని 11 సార్లు జపించాలి.. ఇలా చేయటం వల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయని ప్రగాఢ నమ్మకం..
ఇలా ఉంచడం వల్ల ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయని ఆర్థికపరమైన బాధలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారని హిందూ సాంప్రదాయాలు చెబుతున్నాయి..