Bhakthi గుడికి వెళ్లాలంటే అందరూ చాలా ఆసక్తి చూపిస్తారు హిందూ సంప్రదాయం ప్రకారం గుడికి వెళ్లి మొక్కలు తీసుకుంటారు.. గుడిలో ఉండే ప్రశాంతతే వేరు అలాంటిది ఎవరు వెళ్ళని ఒక గుడి ఉంది అంటే నమ్ముతారా అది ఎక్కడో కాదు భారతదేశంలోనే ఉంది మరి ఆ గుడి ఎక్కడుందో ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం..
మన దేశంలో నిత్యం మంచుతో కప్పబడి ఉండే ప్రాంతం హిమాచల్ ప్రదేశ్.. అక్కడ చంబాలోని భర్మోర్ అనే చిన్నపట్టణంలో ఉంది ఈ ఆలయం. చూడటానికి చాలా చిన్నదిగా ఉండి ఆలయం మహిమలు మాత్రం ప్రపంచమంతా చెప్పుకునే విధంగా ఉన్నాయి. అయితే ఈ గుడి యమ ధర్మరాజు రావడం వల్ల వెళ్లడానికి అందరూ చాలా భయపడుతుంటారు.
హిమాచల్ ప్రదేశ్ లో ఎత్తైన పర్వతాల మధ్య ఉండే ఈ గుడికి అందరూ వెళ్ళరు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ గుడిని దర్శించుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే దీనిని ఎప్పుడు ఎవరు నిర్మించారు అన్న విషయం మాత్రం పూర్తిగా తెలియదు.. ప్రపంచంలో యమధర్మరాజు కోసం ఉన్న ఏకైక ఆలయం ఇది మాత్రమే. అయితే ఈ ఆలయం ఆయన కోసం మాత్రమే ఉందని ఈ ఆలయంలో అతను మాత్రమే ఉండాలని ఇంకెవరూ ప్రవేశించడానికి వీల్లేదని అక్కడ ప్రజలు నమ్మకం.. కొందరు మాత్రం ఈ గుడిలోకి వెళ్లి ఆ దేవుడిని పూజిస్తే వాళ్ళకి అకాల మరణం ఉండదని విశ్వసిస్తారు. అయితే ఈ గుడి కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన చరిత్ర చెప్తూ ఉంటారు. అసలు విషయం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. అయితే ఇదే ఆలయంలో చిత్రగుప్తుడికి కూడా ఒక చిన్న గది ఉంది ఈ ఆలయం కోసం పూర్తి సమాచారం అయితే దొరకలేదు.