అంతర్జాతీయంగా విడుదలైన RRR సినిమాతో పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు జాతీయ స్థాయిలో మారుమ్రోగిపోయింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో తన ప్రదర్శనతో విమర్శకుల ప్రశంసలందుకున్న చరణ్…. ఈ సినిమా తర్వాత అదే స్థాయి సినిమాలను అనౌన్స్ చేశారు. RRR బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత… భారీ సినిమాలకు చిరునామాగా నిలిచే డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో ఓ భారీ మూవీని ప్రకటించి… ఆశ్చర్యపరిచారు.
సమకాలీన రాజకీయాంశాల నేపథ్యంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం… 90వ దశకం నేపథ్యంలో జరిగిన పలు రాజకీయాంశాలకు నేటి వాతావరణానికి తగ్గట్లుగా సరిపోల్చుతూ… ఈ మూవీని రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మూవీని శంకర్ RC15 అనే వర్కింగ్ టైటిల్‌పై నిర్మిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని… స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు… తన సంస్థలో 50వ ప్రాజెక్ట్‌గా అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో కీలక అంశాన్ని హీరో రామ్‌చరణ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఎస్‌జే సూర్య ఫొటోని షేర్ చేస్తూ ‘వెర్సటైల్ యాక్టర్ మా స్టెల్లర్ కాస్ట్‌లో చేరారు. వెల్కమ్ ఆన్ బోర్డ్ సర్’ అంటూ ఎస్‌జే సూర్యను ఈ ప్రాజెక్ట్ లోకి స్వాగతం చెబుతూనే పోస్ట్ చేశారు. రామ్ చరణఫ్ షేర్ చేసిన ఎస్.జె. సూర్య ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
అయితే.. ’ఇండియన్-2’ రీ ఓపెన్ కారణంగా RC 15 కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఆ బ్రేక్‌ను దాటుకుని… ఇప్పుడు తాజాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లోృ ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎస్.జె. సూర్య RC 15 సెట్ లోకి అడుగుపెడుతున్నారట. ఇప్పటికే రాజమండ్రి, అమృత్ సర్, హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తయింది. ఎస్.జె. సూర్య ఎంట్రీతో ఈ మూవీ షూటింగ్ స్పీడందుకోనుంది.