Movie review రణ్ బీర్ కపూర్ అలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర.. భారీ అంచనాల నడుమ ఈరోజు విడుదలైంది.. ఇప్పటికే సినిమా చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే..
పురాతనకాలంలో ఉన్న శాస్త్రాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. పురాతన కాలంలో ఉన్న అస్త్రాలు ముఖ్యంగా నంది అస్త్ర.. బ్రహ్మాస్త్ర… ప్రభాస్త్ర.. జలాస్త్ర.. పవనాస్త్ర.. వీటి యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ తీసిన ఈ సినిమాలో అన్నిటికంటే శక్తివంతమైన బ్రహ్మాస్త్ర చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.. ప్రస్తుత కాలంలో ఈ బ్రహ్మాస్త్ర ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని పట్టుకొని సినిమా నడుస్తుంది..రియల్ లైఫ్ కపుల్ గా ఎంత సక్సెస్ సాధించారో సినిమాలో కూడా రణబీర్ జంట అంతే బాగుందని అంటున్నారు.. అగ్ని అస్త్రగా రణబీర్ కపూర్.. నంది అస్త్రగా నాగార్జున అద్భుతమైన నటన కనబరిచారని సమాచారం.
సూపర్ నేచురల్ పవర్డ్ సైంటిస్ట్ పాత్రలో షారుఖ్ ఖాన్ కనిపించాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్ లో అమితాబ్ ఎంట్రీ అదిరిపోతుంది. భారీ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ ఆకట్టుకున్నాయని ప్రేక్షకులు అంటున్నారు.. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా అద్భుతంగా పండించారని సమాచారం.అయితే స్టోరీకి తగ్గ డైలాగ్స్ లేకపోవడం.. ఎమోషన్స్ పండకపోవడం ఈ సినిమాకు మైనస్ అని అంటున్నారు. కొన్నిచోట్ల సీన్స్ మరీ పెద్దగా ఉన్నాయని చూసినవారు అభిప్రాయపడుతున్నారు. అయితే సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిందని చెప్పాలి.. కథ కొంచెం గందరగోళాన్ని కలిగించిందని ప్రేక్షకులు అంటున్నారు. రణ్ బీర్ కన్నా అలియా భట్ ఈ చిత్రంలో నటనకు మంచి పేరు సంపాదించుకుంది.