politics అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ ప్రధాన నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2020 ఫిబ్రవరిలో భారత్కు వచ్చానని అప్పుడు ప్రధాన మోడీ ఇచ్చిన ఆతిథ్యం తను ఎప్పటికీ మర్చిపోలేనని కితాబిచ్చారు. మోదీతో కలిసి అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు కొనసాగిన ఆయన పర్యటనలో మోడీ తనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని అప్పట్లోనే చెప్పారు. అంతేకాకుండా భారత్ అమెరికాల మధ్య బంధం మరింత బలపడాలని మోదీ గట్టిగా ఆకాంక్షించారని అన్నారు. అయితే మళ్లీ ఇంకోసారి తనకు మోడీపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఆయనపై ప్రశంసలు వర్షం కురిపించారు.
“భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో నాకు మంచి అనుబంధం ఉంది. మేము చాలా మంచి మిత్రులం కూడా. మోదీ చాలా అద్భుతమైన వ్యక్తి కష్టపడి పని చేస్తారు. అంత గొప్ప పదవులు ఉన్న వ్యక్తి అంత సామాన్యంగా ఉండటం సాధ్యమయ్యే పని కాదు అయినా మోడీ అలా ఉండటం ఆయన గొప్పతనం. భారత్‌కు నా కంటే మంచి మిత్రుడు ఎవరూ లేరు.. మోడీ హయాంలో భారత్ కు అమెరికాకు మధ్య బంధం మరింత బలపడిందని” అన్నారు.
2024 అమెరికా ఎన్నికల్లో తను తప్పకుండా పోటీ చేస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. తను మళ్లీ పోటీ చేయాలని.. అధ్యక్ష పదవిలో తనను చూడాలని అమెరికా ప్రజలు ఎదురుచూస్తున్నారని ట్రంప్ అన్నారు. అయితే తను ఏం చేయాలనేది.. ఎలా ముందుకు వెళ్లాలి.. అనేది ఇంక పూర్తిస్థాయిలో ఆలోచన జరగలేదని ఏం జరుగుతుందో ముందు ముందు చూడాలని అన్నారు.