Politics బెంగళూరు ప్రస్తుతం అకాల వర్షాలతో అతలాకుతలమైంది.. ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అత్యవసర మీటింగ్ పెట్టారు. పలు విషయాలను చర్చించారు. అయితే ఇంత ముఖ్యమైన సమావేశంలో కర్ణాటక మంత్రి అర్ అశోక్ నిద్రపోయారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అధ్వర్యంలో జరిగిన సమావేశానికి కర్ణాటక మంత్రి అర్ అశోక్ వచ్చారు.. అయితే ఈ సమావేశానికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అందులో మంత్రి అశోక్ నిద్రపోతున్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయంపై కాంగ్రెస్ మంత్రులు దాడికి దిగారు.. రాష్ట్రమంతా అల్లకల్లోలమై వరదల్లో మునిగిపోతుంటే మంత్రి మాత్రం నిద్రమత్తులో మునిగిపోయారు అంటూ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.. రాష్ట్ర ప్రజలను పట్టించుకోవడం మానేసి ఇలానే నాయకులు నిద్రపోతూ ఉంటే రాష్ట్రం ఎప్పుడు బాగుపడతాదని విమర్శిస్తున్నారు. అయితే ఈ విషయంపై కర్ణాటక ప్రభుత్వం కానీ మంత్రి అర్ అశోక్ కానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
ఈ సమావేశంలో బెంగళూరు ప్రజలను గట్టేక్కించేందుకు ప్రభుత్వం తన వంతు తోడ్పాటును అందించనుంది. ఇందు నిమిత్తం సుమారు రూ. 300 కోట్లు విడుదల చేయాలని సీఎం బొమ్మె నిర్ణయించినట్లు పేర్కొన్నారు.