చిత్రకళ : Story about Sudhakanth, Painter, MFA.
కళ అనేది ఒక గొప్ప అనుభూతిని పంచే మాధ్యమం, అందులో నైపుణ్యం సంపాదించడం ఒక సాధన ద్వారా, తపస్సు ద్వారానే సాధ్యం,కొంతమందికి ఆ కళ పుట్టుక ద్వారానే అబ్బుతుంది, కొందరికి ఇష్టం ద్వారా తపన సాధన ద్వారానే అబ్బుతుంది, అలాంటి కళను పుట్టకతోనే స్వంతం చేసుకున్న సహజ చిత్రకారుడు సుధాకాంత్ గారు, కానీ అంతటితో ఆగక చిత్రకళ లో మాస్టర్ డిగ్రీ చేసి మనసుకు, తన చేతిలోని కళకు సాధన ద్వారా సానబెట్టి, గొప్ప నైపుణ్యాన్ని స్వంతం చేసుకున్నారు.
జననం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఉరవకొండ మండలంలోని కొట్టాలపల్లే గ్రామంలో జన్మించారు, తల్లి పద్మావతి, తండ్రి వేణుగోపాల్, వారు ఇద్దరూ ఉపాధ్యాయులు, తండ్రి తెలుగు పండిట్, తల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, చిన్నప్పటినుండి చిత్రకళ మీద మక్కువ వున్న సుధాకాంత్ ను ఆదిశగా ప్రోత్సహించి తన అభిరుచికి తగినట్టుగా చదివించారు తల్లిదండ్రులు, అదివారి ఉన్నత ఆదర్శానికి నిదర్శనం.కళ అబ్బడం ఒకఎత్తు, దాన్ని సాధన ద్వారా నైపుణ్యం సంపాదించడం ఒక ఎత్తు, బెంగళూరు లోని కెన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో BFA చేశారు, మైసూరులో MFA చేసి ఆలోచనా విధానంలో పరిపక్వతనూ, పనిలో నైపుణ్యం సంపాదించారు, సమకాలీన చిత్రకళలో అసామాన్యమైన ప్రతిభతో పట్టభద్రులుగా జీవన ప్రగతి మొదలు పెట్టారు, బెంగళూరు నుండి హైదరబాద్ వచ్చి, multimedia నేర్చుకొన్నారు, కొంతకాలానికి icfai అనే సంస్థలో గ్రాఫిక్ ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు, అక్కడ ఉద్యోగం చేస్తూ చిత్రకళలో సాధన చేస్తూ వుండేవారు.
సమకాలీన చిత్రకళా నైపుణ్యంలో అంచలంచెలుగా ఎదుగుతూ, ఎన్నో చిత్రకళా ప్రదర్శనలలో పాల్గొంటూ మన్ననలు పొందుతూ వచ్చారు, నిరంతర అన్వేషి, నిత్య విద్యార్థి, ప్రకృతి ప్రేమికుడు సహజ సృజనాత్మక ప్రతిభా శీలి, చిత్రకారుడు మన సుధాకాంత్ గారు. తత్వ శాస్త్రం మీద పట్టు, మానసిక విశ్లేషణల మీద అవగాహన, సమాజం మీద ఖచ్చితమైన అభిప్రాయము ఇలాంటి మానసిక స్థాయి కలిగిన చిత్రకారుడు. తన చిత్రాలను లాభాపేక్షలేని మనసుతో, స్వేచ్ఛగా చిత్రించడానికి చాలా ఇష్ట పడతారు.
సుధాకాంత్ తన చిత్రకళ లో మాధ్యమంగా acrylic రంగుల వాడకాన్ని ఎక్కువగా ఇష్టపడతారు, దానివలన తన మనసు వేగాన్ని అందుకొగలిగిన మాధ్యమంగా, ఎంతో అద్భుతంగా తనకు సహకరిస్తుందని చెబుతారు, అందులో opek, transparent, technics ను వాడుతూ భావ వ్యక్తీకరణ విధానం లో చిత్రాన్ని రూపొందిస్తారు. అందులో ఆయన ఇష్టంగా వాడే రంగులు నలుపు, ఎరుపు, నీలం, కాషాయం, ultra blue, light blue వంటి విలక్షణ రంగుల మేళవింపుతో చిత్రాలను రూపొందించడంలో నిష్ణాతులు. స్వయంగా నాస్తిక ఆలోచన విధానం చేసే ఆయన చిత్రకళ ద్వారా ఆస్తికత్వానికి కూడా అందం తీసుకొచ్చారు. ఆలోచనా విధానం వలననే పని సాగుతుంది, జీవన విధానం సాగుతుంది అని నమ్మే సిద్ధాంత వాది. అందుకే ఆలోచనకు, విషయ సమాలోచనలు చేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు, తార్కిక విధానము, విషయ తర్కము, విశ్లేషణ, వివరణాత్మక, వినూత్న భావ వ్యక్తీకరణ, ఓర్పు, సహనం, మాసిక పరిపక్వత, ఆత్మ స్థైర్యం పుణికి పుచ్చుకున్న ఆయన నిత్యాన్వేషి. నిత్య కృషీ వలుడు. నిత్య యోచనా పరుడు. తన వ్యక్తిత్వానికి, స్వేచ్ఛకు అత్యంత విలువనిచ్చే మనిషి, అలాగే ఇతరుల స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని హరించకూడదు అన్న మూల సిధ్ధాంతాన్ని తన జీవన మాధ్యమంగా ఉంచుకున్నారు. తత్వ శాస్త్రం మీద పట్టు, మానసిక విశ్లేషణ ల మీద అవగాహన, సమాజం మీద ఖచ్చితమైన అభిప్రాయము ఇలాంటి మానసిక స్థాయి కలిగిన చిత్రకారుడు సుధాకాంత్ గారు తన చిత్రాలను లాభాపేక్షలేని మనసుతో, స్వేచ్ఛ గా చిత్రించడానికి చాలా ఇష్ట పడతారు.
చదువుకునే రోజుల్లో రోజుకు 100 స్కెచెస్ చేసి, కళాశాలలో గొప్ప పేరు సంపాదించుకున్నారు, ఇప్పటికీ ఆ గుర్తింపు ఆయన స్నేహితులలో ఉంది. కాన్వాస్ క్లాత్, పేపర్, గోనె సంచి, ఇలా రక రకాల ఉపరితలాల మీద ప్రయోగాత్మకంగా చిత్రాలు చెయ్యడంలో ఆయనకు అందరినీ మెప్పించడం లో ఆయనకు ఆయనే సాటి. సమకాలీన చిత్రకళ లో ముఖ్యంగా ప్రయోగాత్మక విధానం లో చాలా ఆధునిక స్థాయికి చేరుకున్నారు సుధాకాంత్ గారు.
సమకాలీన చిత్రకళా విధానంలో నిబిదితమై వున్న స్వేచ్ఛను అర్థం చేసుకోవడంలోనే అత్యంత అద్భుత భావ వ్యక్తీకరణ వుంటుంది అని విశ్వసిస్తారు. చిత్రకళలో వున్న సొగసు స్వేచ్ఛాపూరిత భావ వ్యక్తీకరణ ద్వారానే సాధ్యం అని గాఢంగా విశ్వసిస్తారు, మూసపద్దతి విధానాలను జీవితం లోనూ చిత్రకళలోనూ అస్సలు ఇష్టపడరు. ప్రశ్నించే తత్వం, తార్కిక ఆలోచనా విధానం ఆయనకున్న అత్యంత శక్తివంతమైన మానసిక బాలాలు. ఆయన విమర్శనా శక్తి గొప్ప మార్పుకు తోడ్పడే విధంగా వుంటుంది, చాలామంది స్ఫూర్తి పొంది, ఆ దిశగా పయనించి, తమ మార్గాలను సుగమం చేసుకున్నారు.
దేవుడు దెయ్యం ఈ రెండు విషయాలమీద ఖచ్చితమైన అభిప్రాయం వుంచుకున్న సుధాకాంత్ నాస్తికుడు అనే చెప్పవచ్చు.
ఇలాంటి సామాజిక, వ్యక్తిత్వ విమర్శనాత్మక, విశ్లేషణా ద్వారా, తాను సంపాదించుకున్న మానసిక ధోరణి విధానాన్ని చిత్రకళ ద్వార వ్యక్తపరచడంలో సఫలీకృతులయ్యారు. భవావేశాలను, సృజనాత్మకంగా, అందంగా, కంటికి ఇంపుగా, సొంపుగా తీర్చిదిద్దడంలో చేయితిరిగిన వారు సుధాకాంత్.
భావాలను ప్రతీకాత్మకంగానూ, సహజ వ్యక్తీకరణ విధానం లోనూ, విపులీకరణ పద్ధతి లోనూ, ప్రయోగాత్మక, పరశీలనాత్మకతో కూడిన విశ్లేషణాత్మక విధానంలో ఉహ్యాత్మకమయిన చిత్రాలను రంగుల మేళవింపుతో వ్యక్తపరచడం సాధన, శ్రద్ధ, సృజనాత్మక మేళవింపుల అద్భుత సమ్మేళనం అని చెప్పవచ్చు.
కనీస మానవ జ్ఞానం అన్నది కళాకారులకు వుండవలసిన ప్రాథమిక మానసిక లక్షణం. ఆ లక్షణమే వారి కళలో ప్రస్ఫుటంగా కనిపించాలి, అలాగే మానసిక ఆలోచనా ధోరణిలో కూడా అగుపించాలి అని అంటారు సుధాకాంత్ గారు.
పుస్తకాలు చదవడం బాగా ఇష్టపడే సుధాకాంత్ గారు, స్వీయ తర్కం, స్వీయ విశ్లేషణ ద్వారా ఎంతో మానసిక ఉన్నతిని సాధించారు.
ఇన్ని విలువలున్న సుధాకాంత్ గారు, మంచి గాయకుడు కూడా, తనకున్న జన్మతః స్వర జ్ఞానంతో ఆ కళను స్వంతం చేసుకున్నారు. దానికి తోడు సంగీత జ్ఞానం కూడా అబ్బింది.
నిరంతర అన్వేషి, నిత్య విద్యార్థి, ప్రకృతి ప్రేమికుడు సహజ సృజనాత్మక ప్రతిభా శీలి, చిత్రకారుడు మన సుధాకాంత్ గారు. నీతి నిజాయితీ, నియమ నిబద్దత, వుండి కనీస జ్ఞానంతో మెలగడమే గొప్ప జీవితానికి మార్గం అని విశ్వసిస్తారు.
Exhibitions
2001 లో మార్చి 8న ప్రపంచ స్త్రీ దినోత్సవం సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu gaari చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నారు,
2003 ఏప్రిల్ నెలలో మొదటి సారి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆర్ట్ గాలరీ లో సోలో ఆర్ట్ Exhibition చేశారు, ఆరోజు ముఖ్య అతిథి గా డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారిని ఆహ్వానించారు, అలాగే ఇంకొంతమంది పెద్దలు విచ్చేసి విజయవంతం చేశారు, ఎన్నో ప్రముఖ పత్రికల ప్రశంసలు అలాగే విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు.
2007 శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రకళ పోటీలో ఉత్తమ పెయింటింగ్ అవార్డ్ పొందారు.
అప్పటికే ఎన్నో సోలో Exhibitions, Group Exhibitions చేస్తూ వస్తున్నారు, కపరో ఎనర్జీ ( Caparo Energy ) అనే కంపెనీ వారికి, ఫేస్బుక్, శిల్పారామం, ఇతర ముఖ్య సంస్థలకు తన చిత్ర కళా రాజలను అందించారు,
2013 ప్రముఖ ఇండి పాప్ సింగర్ అయిన బాబా సెహగల్ గారి చేతుల మీదుగా చిత్రకళా ప్రదర్శన ప్రారంభోత్సవం జరిపించారు, ఆ ప్రదర్శన అందరి మన్ననలు పొందింది,
2014 లో ప్రముఖ వివాదాస్పద, విలక్షణ, క్రికెట్ ఆటగాడు అయిన అంబటి రాయుడు గారు స్టూడియో కి విచ్చేసి 30 పెయింటింగ్ లను కొని తన సేకరణలో పదిలపరుచుకున్నరు.
2014 లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కళలు మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ చిత్రకళా శిబిరం లో పాల్గొని తనదయిన శైలితో ప్రతిభతో అందరినీ ఆకట్టుకొని, ప్రశంసలు అందుకొన్నారు. అక్కడ పాల్గొన్న అంతర్జాతీయ కళాకారుల తో తన స్నేహం కొనసాగిస్తున్నారు, 2015 లోనే దక్షిణ కొరియాలో జరిగిన చిత్రకళా ప్రదర్శన లో పాల్గొన్నారు.
2015 లో బెంగళూరు చిత్రకళా పరిషత్ లో తన పూర్వపు స్నేహితులతో కలసి పెయింటింగ్ ఎక్సిబిషన్ చేశారు, ప్రముఖ చిత్రకారుడు కృష్ణ శెట్టి గారి ప్రశంసలు పొందారు. తన చిత్రకళా జీవన ప్రస్థానంలో ఇప్పటివరకూ 3000 పై చిలుకు చిత్రాలు, శిల్పాలు చేశారు,
2016 తరువాత గ్రూప్ షో లలో పాలు పంచుకుంటూ చిత్రకళకు సమాంతరంగ 2009 నుండి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సైకత చిత్రకళను సాధన చేయడం మొదలు పెట్టారు.