Politics కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు..
కేంద్రం వాటా ఉన్న ప్రతి పథకానికి తప్పనిసరిగా కేంద్రం పేరు పెట్టాల్సిందే.. అనే నియమాన్ని తెలంగాణ ప్రభుత్వం పాటించట్లేదని అన్నారు.. రాష్ట్రం తరపున వాటా మంజూరు అవగానే కేంద్రం రుణాలు మంజూరు చేస్తుందని.. ప్రతి సమయంలో ఇలానే చేస్తూ వచ్చామని తెలిపారు.. ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను ఏం మాట్లాడారో తెలుసుకుని మంత్రి హరీష్ శంకర్ మాట్లాడి ఉంటే బావుండేిదని.. తను అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతోనే తన అలా ప్రవర్తించాల్సి వచ్చిందని తెలిపారు. ఎవరైనా తనతో వ్యంగంగా వెటకారంగా మాట్లాడితే ఎలా సమాధానం చెప్పాలో తనకు తెలుసు అని ఈ సందర్భంగా నిర్మల సీతారామన్ అన్నారు.. అయితే 2021 వరకు తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ లో ఎందుకు చేరలేదో తెలుసుకోవాలంటూ విమర్శించారు.
తెలంగాణ పర్యటనలో ముందు నుంచి నిర్మలమ్మ తెలంగాణ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.. కేంద్ర రాజకీయాలు తర్వాత.. ముందు రాష్ట్ర రాజకీయాల్ని కోవాలని హేతువా పలికారు.. మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ గా మార్చిన ఘనత కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే పుట్టిన పిల్లాడి పైన కూడా లక్ష రూపాయలు అప్పు ఉంది అంటే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలన్నారు.