నేడు జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్‌కల్యాణ్ బర్త్‌డే. ఎంతో మంది ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ పుట్టిన రోజును ఆయన అభిమానులు పండగలా జరుపుకొంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగానే ఇండస్ట్రీలోకి వచ్చి రాజకీయ పార్టీ పెట్టిన పవన్.. ఇప్పుడు విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇంతటి స్టార్‌లా ఎదిగిన ఆయన.. చిన్నప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నారట! ఇంతకీ అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా..
పవర్‌స్టార్‌కు చిన్నతనంలో ఎప్పుడూ హెల్త్ బాగుండేది కాదట. ఆస్తమా ఉండేది. అందుకే పవన్ కల్యాణ్ అంత హుషారుగా ఉండేవారు కాదు. స్నేహితులు తక్కువే. ఉన్న ఇద్దరో ముగ్గురో ఉన్నా వారి ఆలోచనలు పవర్ స్టార్ ఆలోచనలు భిన్నంగా ఉండడంతో ముచ్చట్లు తక్కువే. చిన్నతనం నుంచి పవన్ చదువులో వెనుకుండేవారు. అలాగే ఇంటర్‌లో ఫెయిల్ అయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఏమైనా అంటారు అనుకుంటే వారు ఏం అనలేదు. ఏమీ కాదులే అంటూ అండగా నిలిచారు.
స్నేహితులు అంతా ముందుకెళ్తుంటే తాను మాత్రం ఉన్న చోటే ఉన్నానేంటి? ఎందుకిలా అవుతోంది? అంటూ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. అదే సమయంలో పవన్ ఆత్మహత్యకు ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు గమనించడంతో బతికి బయట పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కల్యాణ్ ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. ఏదేమైనా సక్సెఫుల్ అయిన ప్రతి వ్యక్తి ఎదుగుదల వెనుకా ఇలాంటి చీకట్లూ ఉంటాయనేది ఎవరూ కాదనలేని వాస్తవం.