Politics 2021లో దేశవ్యాప్తంగా 76 దేశద్రోహం కేసులు నమోదైతే.. అందులో 29 కేసులు ఆంధ్రప్రదేశ్ లోనే నమోదయ్యాయి.. అంటూ నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.. జగన్మోహన్ రెడ్డి గారు “మీ నేరాలు-ఘోరాల చరిత్ర వచ్చేసింది. మీ విధ్వంస పాలన దుష్ఫలితాలు వచ్చేశాయి. నేరాలు-ఘోరాలలో గణనీయమైన అభివృద్ధి సాధించడంలో మీరు ఏ1 అని మరోసారి నిరూపించుకున్నారు” అంటూ ట్విట్టర్ వేదికగా గుప్పించారు.
“ఆర్థికనేరాలలో ఆరితేరి 32 సీబీఐ, ఈడీ, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మీ మూడేళ్ల పాలనలో ఆర్థికనేరాల కేసులు 9273కి పెంచడం మీ ప్రతిభకి నిదర్శనం..
పర్యావరణ నిబంధనలను అతిక్రమించిన కేసులు 2019లో 188 నమోదు కాగా, మీ బ్రాండ్ డిజిట్ “420“ కేసులకి చేర్చిన మీ ఘనతని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఓ రికార్డుగా గుర్తించింది. అందులో 29 దేశద్రోహం కేసులు నమోదు చేసి మీరు నెంబర్‌వన్”గా నిలిచారు.
“అధికధరలు, అరాచకపాలన, విధ్వంసం భరించలేక కడుపుమండి సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టిన వారందరిపైనా జగన్ పీనల్ కోడ్ వాడి దేశద్రోహం కేసులు బనాయించారు. విజనరీ చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ వన్ అయితే, ప్రిజనరీ జగన్‌రెడ్డి పాలనలో నేరాల్లో నెంబర్‌వన్ అయ్యిందని” నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు వెల్లడించాయి.
జగన్ రెడ్డి గారూ మీ విధ్వంస పాలన దుష్ఫలితాలు వచ్చేశాయి. నేరాలు-ఘోరాలలో గణనీయమైన అభివృద్ధి సాధించడంలో మీరు ఏ1 అని మరోసారి నిరూపించుకున్నారు.(1/5) pic.twitter.com/bNhlzALB25
— Lokesh Nara (@naralokesh) September 1, 2022