Political News : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రస్తుతం బీహార్ పర్యటనలో ఉన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కలిసిన సీఎం కేసీఆర్ గాల్వానా ఘటనలో మరణించిన పదిమంది బిహారి సైనికులకు 10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. దీంతో ఆయన్ను బీహార్ గవర్నమెంట్ పొగడ్తలతో ముంచెత్తుతుంది.
బీహార్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ బీహార్ సీఎం నితీష్ కుమార్ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ను కూడా కలిశారు. ఈ సందర్భంగా గాల్వానా బాధితులకు 10 లక్షలు, సికింద్రాబాద్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బిహారి కార్మికులకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.
అయితే ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ నితీష్ కుమార్ మధ్య జాతీయ రాజకీయాలపై వాడా వేడి చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆయన రోజురోజుకి రూపాయిలు పడిపోతుందని జాతీయ రాజకీయాల్లో మోడీ పాత్ర ఏమీ లేదని విమర్శించినట్టు తెలుస్తుంది. దేశ భవిష్యత్తులో మార్పు రావాలి అంటే అందరూ ఏకం కావాలని కేసీఆర్ పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది.