Crime News : అంకిత సింగ్ హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది.. విద్యార్థిని ఓ ప్రేమోన్మాది పెట్రోల్ పోసి తగలపెట్టడంతో దేశమంతా అట్టుడికి పోయింది.. అయితే ప్రస్తుతం మీ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది.
జార్ఖండ్ లో జరిగిన ఈ సంఘటన రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఇంతవరకు బాధితురాలు మేజర్ అని నమ్మించినా.. కాదు ఆమె మైనర్ అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్ధారించింది.. దీంతో నిందితుడిపై వెంటనే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆ కమిటీ ఝార్ఖండ్ పోలీసులను ఆదేశించింది. పోలీసులు అంకిత సింగ్ వయసు పై ఇంతవరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఆమె వయసును 19 సంవత్సరాలుగా నమోదు చేసి.. మీడియాకు మాత్రం 17 సంవత్సరాలుగా వెల్లడించారు. రోజుకో మాటతో మారిపోతున్న పోలీసులు తీరుని చూసిన చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ రంగంలోకి దిగింది. వీళ్లు బాలిక వయసును 15 సంవత్సరాలుగా నిర్ధారించి.. వెంటనే నిందితుడు పై చర్యలు తీసుకోవాలని ఝార్ఖండ్ పోలీసులు ఆదేశించారు.
బీహార్ జార్ఖండ్ లోని డుమ్కా ప్రాంతానికి చెందిన అంకిత సింగ్ ను షారుఖ్ హుస్సేన్ ప్రేమ పేరుతో వేధించగా ఆమె నిరాకరించింది. దీంతో షారుఖ్ ఆమెపై ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి తగలపెట్టాడు ఈ క్రమంలో ఆమె వారం రోజులు మృతువుతో పోరాడి ఆగస్టు 28వ తారీఖున కన్ను మూసింది.