Crime News: దేవుని దర్శనం నిమిత్తం కుటుంబ సభ్యులందరూ పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని ఆ దైవమే దర్శించడానికి వెళ్లడం జరుగుతుంది. ఆనందంగా వెళ్లిన కుటుంబ సభ్యులు బొరువెక్కిన గుండెతో ఇంటికి చేరడం విషాదంగానే చెప్పుకోవాలి. ఇటువంటి ఘటనే రాజస్థాన్‌లోని పాలీ జిల్లా లో చోటు చేసుకుంది ఈ పెను ప్రమాదంపై ప్రధాని మోదీ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తపరిచారు.
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో దైవాన్ని దర్శించేందుకు వెళ్లారు ఆ కుటుంబ సభ్యులు ఇంటికి వస్తున్న క్రమంలో భక్తులతో వెళ్తోన్న ట్రాక్టర్ ట్రైలర్, ట్రక్కు ఢీకొట్టడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మందికిపైగా గాయపడ్డారు.సుమేర్‌పుర్ పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులు ట్రాక్టర్-ట్రైలర్‌లో వస్తుండగా.. ఎదురుగా వచ్చిన భారీ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఆరుగురు భక్తులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు.
కాగా సుమేర్‌పుర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి రామేశ్వర్ విలేకరులతో మాట్లాడుతూ.. ట్రాక్టర్‌లో జైసల్మేర్ రామ్‌దేవ్రా ఆలయానికి వెళ్లొస్తుండగా ఈ పెను ప్రమాదం చోటుచేసుకుందని ఆ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టామని చెప్పారు. గాయలతో ఉన్నవారిని సమీప ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలియజేశారు రాత్రిపూట ఈ ప్రమాదం జరగడంతో సహాయక చర్యలు కాస్త ఇబ్బంది ఎదుర్కొన్నామని తెలిపారు.ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారంని ట్వీట్ ద్వారా తెలియజేశారు.కష్ట సమయంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని అలానే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ట్వీట్ రూపంలో వ్యక్తపరచడం జరిగింది.