Political News : ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతుంది నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసిన విషయం అందరికీ తెలిసిందే. అలానే ప్రత్యర్థి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కొత్త రాష్ట్రపతిని కలిసి చర్చ జరిపిన విషయం అందరికీ తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తయితే కేంద్ర హోమ్ మంత్రిని అమిత్ షా అని జూనియర్ ఎన్టీఆర్ కలవడంతో ఏపీలో రాజకీయం మరోవైపు దారితీస్తుంది. అయితే బీజేపీ ప్రభుత్వం మాత్రం అమిత్ షా ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటనను అభినందించడానికి మాత్రమే కలిశారని చెప్పడం జరుగుతుంది.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా సమావేశంపై ఏపీ తెలుగు, సంస్కృతి అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి కూడా స్పందించడంతో ఏపీలో రాజకీయం హాట్ హాట్ గా ఉంది. నేడు లక్ష్మీపార్వతి తిరుపతిలో మీడియా మిత్రులతో మాట్లాడిన లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాతయ్య వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ లక్ష్మీపార్వతి ఆకాంక్షించారు. అలానే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీని పూర్తి హక్కులతో స్వాధీనం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.
అయితే లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలపై టీడీపీ పార్టీ అధినేతలు లక్ష్మీపార్వతి ఇలా మాట్లాడటం సరికాదని. టిడిపి పార్టీలో అందరూ కష్టపడి శ్రమిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ అని లక్ష్మీపార్వతి వ్యాఖ్యలకు తిరిగి కౌంటర్లు ఇవ్వడం జరుగుతుంది