ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగానే గతంలో రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి ఎన్నికలు సహా చాలా అంశాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించారు.
మరి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది ?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ చిన్న విషయంలోనూ సహకరించక పోగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రేపో మాపో జైలుకు పంపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ద్వారా నిత్యం బెదిరింపులకు పాల్పడింది.
బెదిరింపులకు పాల్పడడమే కాకుండా కేంద్రం తన చేతిలో ఉన్న అన్ని అధికారాలను ఉపయోగించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని , ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నది. తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా తెలంగాణ రైతులను, కేసీఆర్ రైతు ప్రభుత్వాన్ని నానా ఇబ్బందులకు గురి చేసింది . తెలంగాణకు న్యాయంగా రావాల్సిన రుణాల మీద అర్ధం లేని ఆంక్షలు పెట్టి వేధిస్తున్నది. కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా 8 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్నది. కృష్ణా , గోదావరి ప్రాజెక్టుల నిర్వహణను తన చేతుల్లోకి గుంజుకోవడానికి కుట్ర చేస్తున్నది. కాళేశ్వరం , పాలమూరు ప్రాజెక్టులకు , విద్యుత్తు ప్రాజెక్టులకు రుణాలు విడుదల కాకుండా షరతులు పెట్టి ఆ ప్రాజెక్టులను ఆపేసి హింస పెడుతున్నది. మొన్న సుమారు రూ. 1360 కోట్ల విద్యుత్తు బకాయిలు ఉన్నయని కరెంటు నిలిపివేసి లెక్కలు సరిగా చూసుకోలేదని లెంపలేసుకుని మళ్ళీ తప్పు దిద్దుకుంది. ఉపాధి హామీ లాంటి పథకాల్లో కూడా అడ్డమైన నిబంధనల పేరుతో కూలీలను , ప్రభుత్వాన్ని వేధిస్తున్నది. ఇంకా చాలా విషయాల్లో ప్రత్యక్షంగా , పరోక్షంగా , రహస్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను , రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నది.
ఇవన్నీ సాలవన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను రెచ్చగొట్టి ఒక వర్గం మనోభావాలను కించపర్చి హైదరాబాద్ లో మత కల్లోలాలను సృష్టించి ప్రజల్లో భయాందోళనలను రేకిత్తించాలని ప్రయత్నిస్తున్నది.
కేంద్రం తెలంగాణను ఇంత ఇబ్బంది పెడుతుంటే తెచ్చిన తెలంగాణ అభివృద్ధి కోసం కష్ట పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేయాలి ? మూర్ఖంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును అడుగడుగునా ఎండగడుతూ ప్రజలకు కేంద్రం చేస్తున్న మోసాన్ని , కుట్రలను వివరిస్తూ దమ్మున్న నాయకుడిగా ఎదురిస్తున్నరు. తెలంగాణను , దేశాన్ని బీజేపీ నరహంతక పాలన నుండి కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నరు.
తెలంగాణను ఇన్ని రకాలుగా హింస పెడుతున్న బీజేపీ పట్ల ఎలా వ్యవహరించాలో తెలంగాణ ప్రజలందరూ సీరియస్ గా ఆలోచించవలసిన అవసరం ఉన్నది .
బీజేపీ మత ఉన్మాదం , కేంద్ర వేధింపుల వల్ల మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
ఇలాంటి కీలక సమయంలో యావత్ తెలంగాణ బీజేపీ కుట్రలను నిశితంగా గమనిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెన్నంటి నిలిచి తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా తెలంగాణ ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది … జాగ్రత్త !!