బీజేపీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సొంత పార్టీలోనే ఊహించని షాక్ తగిలింది. ఆయన్ను ఆ పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. ఇటీవల ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఆయన చేసిన కామెంట్స్ పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ బీజేపీ క్రమశిక్షణ సంఘం పేర్కొంది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. పార్టీకి సంబంధించిన ఇతర బాధ్యతల నుంచి కూడా తక్షణమే తప్పిస్తున్నట్లు కూడా పేర్కొంది.
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఇప్పటికే అరెస్టయిన రాజాసింగ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ విషయంపై రాజాసింగ్ ఎలా స్పందిస్తారో చూడాలి.