Political News: మొన్నటి వరకు ప్రధానమంత్రి మోడీ తెలంగాణలో పర్యటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా బీజేపీ నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఊహించిన ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. అసలే తెలంగాణ రాజకీయం రోజు రోజుకి మరింత వేడెక్కుతుందని చెప్పుకోవాలి. ఆ ఎన్నికల ప్రభావం ఏమోగానీ బిజెపి నేతలు ఒకరి తర్వాత ఒకరు తెలంగాణను పర్యటించడం అనేది విశేషంగానే చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే ఒకరిపై ఒకరు మాట్లాడుతూ తూట్లు పేలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సహాయం చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం ఎద్దేవ చేసి మాట్లాడుతున్న విషయం అందరికి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నిధులు పంపిణీ చేస్తున్నామని ఇలా మాట్లాడటం సరికాదని మండిపడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే పర్యటనలోని భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ను విందుకు ఆహ్వానించారంట అమిత్ షా.
అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ అవ్వడమేంట అని ఆలోచించకండి. అమిత్ షా ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాను చూసి ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యారు కేంద్ర హోం మంత్రి. పనిలో పనిగా ఎన్టీఆర్ తో మాట్లాడాలని నిర్ణయించుకున్నారంట అమిత్షా, ఈ సందర్భంగా అమిత్ షా ను కలవనున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సినిమాలతో పాటు పలు రాజకీయ అంశాలు కూడా మాట్లాడే అవకాశం ఉండొచ్చేమో.
అలానే ఒక బిజెపి కార్యకర్త ఇంటికివెళ్లనున్నారు అమిత్ షా. బేగంపేట ఎయిర్ ఫోర్ట్ నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఆశీర్వాదం తీసుకొని అనంతరం. సాంబ మూర్తి నగర్లోని బీజేపీ కార్యకర్త అయినా మంద సత్యనారాయణ గత 30 సంవత్సరాల నుండి పార్టీ కొరకు ఎన లేని సేవ చేశారు ఈ నేపథ్యంలో సత్యనారాయణ ఇంట్లో తేనేటి పానీయాన్ని సేవించి వారితో కాసేపు మాట్లాడనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.