Bhakthi దేశవ్యాప్తంగా దేవి నవరాత్రులు ఘనంగా జరిగాయి ప్రతి చోటా అమ్మవారి విగ్రహాలు కొలువుదీరాయి తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజలు జరిపించారు భక్తులు. అయితే ఓ చోట ఏకంగా 8 కోట్ల రూపాయలతో అమ్మవారిని అలంకరించారు ఈ న్యూస్ తాజాగా వైరల్ అవుతుంది..
దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఒక్కొక్కరు ఒక్కో లా పూజించారు కొందరు మట్టి విగ్రహాలు మరికొందరు బంగారం వెండి వాటి లోహాలతో చేసిన విగ్రహాలను తమ పూజా మందిరంలో కొలువై ఉంచారు.. దేశవ్యాప్తంగా ఉన్న దుర్గ అమ్మవారి ఆలయాల్లో అమ్మవారిని ఎంతో వైభవంగా అలంకరించారు రోజు పట్టుచీరలు నగలతో కన్నుల పండుగగా తీర్చిదిద్దారు అయితే ఓ దేవాలయంలో మాత్రం ఏకంగా అమ్మవారిని ఎనిమిది కోట్ల రూపాయలతో అలంకరించారు..
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో ఉన్న వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని ఏకంగా రూ.8 కోట్ల రూపాయల విలువైన కరెన్సీ నోట్లతో అలకరించారు. విశాఖపట్నంలో ఉన్న ఈ ఆలయానికి 135 ఏళ్ల నాటి చరిత్ర ఉంది.. రాత్రి సందర్భంగా అమ్మవారిని ఎనిమిది కోట్ల విలువైన కరెన్సీ నోట్లు నగలతో అలంకరించారు దాదాపు అన్ని రకాల నోట్లతో ఈ ఆలయాన్ని అలంకరించడానికి కొన్ని వందల మంది వాలంటీర్లు పనిచేశారు.. అయితే అక్కడ ఉంచిన డబ్బులు అన్ని కూడా ప్రజల నుంచి సేకరించినవే దేవి నవరాత్రులు ముగిసిన తర్వాత ఆ డబ్బును ఎవరికి వారికి పనిచేయటం విశేషం..