Politics కమిటీలు కూర్పు కు వివాదం రోజురోజుకి ముదురుతుండగా తెలంగాణ కాంగ్రెస్ లో 13 మంది పీసీసీలు తాజాగా రాజీనామా చేశారు.. ప్రస్తుతం విషయం వైరల్ గా మారింది..
కమిటీల కూర్పు వివాదంతో నెలకొన్న వివాదం రోజు రోజుకి పెను దుమారాన్ని రేపింది తెలంగాణ కాంగ్రెస్ లో చీలికలు తెరతీసింది దీంట్లో తెలంగాణలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరికీ కూడా ప్రాధాన్యత లేదు అంటూ కొందరి నాయకులంతా ఒక తాటిపైకి వచ్చిన సంగతి తెలిసిందే అయితే వీరంతా తాజాగా సమావేశమై రేవంత్ రెడ్డి పై ప్రత్యక్షంగానే తమ అసహనాన్ని వ్యక్తం చేశారు..
ముఖ్యంగా సీనియర్ నేతలకు ఎలాంటి కీలక పదవులు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వారంతా అయితే దీనిపై చర్చకు బట్టి విక్రమార్క నివాసం వేదిక అయింది.. ఈ సమావేశానికి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సీనియర్ నేతలు మధుయాష్కీ, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.అలాగే 13 మంది పీసీసీలు ఉత్తమ పదవులకు రాజీనామా చేశారు.. అయితే ఇప్పుడు రాజీనామా చేసిన వీరంతా తమ వల్ల పదవులు రాని వారందరికీ ఈ పదవులు ఇచ్చేయండి అంటూ తమ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.. అలాగే రాజీనామా లేఖను ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌కు పంపించారు నేతలు. వీరిలో నరేందర్ రెడ్డి, సీతక్క, విజయ రామారావు, చారగొండ, వెంకటేష్, ఎర్రశేఖర్, జంగయ్య యాదవ్, దొమ్మాటి సాంబయ్య, పటేల్ రమేష్ రెడ్డి, డా సత్యనారాయణ, ముధసూదన్ రెఎడ్డి, మల్లేష్, సుభాష్ రెడ్డి ఉన్నారు..