Crime కార్డియాక్ అరెస్ట్ ఇప్పటికే ఎందరో దీనివలన చనిపోయారు అయితే ఒకప్పుడు 50 ఏళ్లు దాటాక వచ్చేది తర్వాత 30, 40 ల్లో కూడా కనిపించడం జరుగుతూ ఉంది అయితే తాజాగా మధ్యప్రదేశ్లో ఓ 12 ఏళ్ల బాలుడు కార్డియాక్ అరెస్టుతో మరణించడం అందర్నీ నివ్వెరపరిచింది..
మద్య ప్రదేశ్ లో దారుణ సంఘటన జరిగింది.. 12 ఏళ్ల ఓ విద్యార్థి స్కూలుకు వెళ్తూ బస్సులోనే హఠాత్తుగా కుప్పకూలిపోయాడు… అయితే ఏమైంది అంటూ హాస్పిటల్ కి తీసుకు వెళ్ళేటప్పటికి మరణించాడు అయితే అసలు విషయం తెలుసుకొని అందరూ షాక్కు గురయ్యారు.. వయసు మళ్ళిన వాళ్లకి వచ్చే కార్డియాక్ అరెస్టుతో 12 ఏళ్ల పిల్లాడు చనిపోవడం నిజంగా అందర్నీ షాక్ కి గురిచేసింది
అయితే వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్లో బిందు ప్రాంతానికి చెందిన మనీష్ ఎటవా రోడ్లోని నాలుగో తరగతి చదువుతున్నాడు.. ఎప్పటిలాగే తన సోదరులతో కలిసి స్కూలుకు వెళ్లి మధ్యాహ్నం భోజనం అనంతరం రెండు గంటలకు పాఠశాల నుండి ఇంటికి వచ్చేందుకు స్కూల్ బస్ ఎక్కాడు అయితే ఆ సమయంలో మనీష్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు వెంటనే దీన్ని గమనించిన డ్రైవర్ పాఠశాల యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు వెంటనే అతన్ని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి చేర్చగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.. డాక్టర్ తెలిపిన వివరాల ప్రకారం అతనికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ ఇచ్చాము. అప్పటికే ప్రయోజనం లేకుండా పోయింది. అతని లక్షణాల ప్రకారం.. మనీశ్ గుండె వైఫల్యంతో మరణించాడని వెల్లడించారు.. అయితే బాబు కుటుంబ సభ్యులు మాత్రం పోస్ట్ మాత్రం నిర్వహించొద్దని తెలిపినట్టు చెప్పారు డాక్టర్..